telugu navyamedia
Uncategorized సినిమా వార్తలు

స్మృతి పథంలో దాసరి నారాయణ రావు

Dasari-Narayana-Rao
నేటికీ 36 సంవత్సరాలనాటి అరుదైన జ్ఞాపకమ్.
1983 మార్చి 23వ తేదీ బుధవారం. నేనప్పుడు ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాను.
DNR 4అప్పట్లో సినిమా షూటింగ్ లను క్రమం తప్పకుండా అభిమానులకు, పాఠకులకు అందజేస్తుండేవాళ్ళం. షూటింగ్ ఎక్కువ భాగం స్టూడియోస్ లో జరుగుతుండేవి. హైద్రాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, భాగ్యనగర్ స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, శ్రీ సారధి స్టూడియోస్ ఉండేవి.
అయితే ఎక్కువ భాగం షూటింగ్ లు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతూ ఉండేవి. అన్నపూర్ణ స్టూడియోస్ లో నాలుగు ఫ్లోర్ లు, ఓ మండువా ఇల్లు, గార్డెన్ ఉండేవి.
Dasari-Narayana-Rao2ఆరోజు నేను అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను. దాసరి నారాయణ రావు అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నిర్మించే చిత్రం షూటింగ్ జరుగుతుంది.
దర్శకుడు దాసరి నారాయణ రావు షూటింగ్ తప్పకుండా ఉండేది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవైపు షూటింగ్, మరో వైపు ఎడిటింగ్, డబ్బింగ్, పాటలకు ట్యూన్స్ చేయించడం, నిర్మాతలు కథలు వినిపించి వాటిని ఒకే చేయించడం ఆయన దిన చర్య. ఆయన్ని సినిమా రంగంలో పని రాక్షసుడు అంటారు.
అక్కినేని నాగేశ్వర రావు అయితే హ్యూమన్ కంప్యూటర్ అనేవాడు.
DNR 1అయితే ఆరోజు దాసరి నారాయణ రావుతో పాటు యూనిట్లో అందరు చాలా హ్యాపీగా వున్నారు.
ఒక్కొక్కరు వచ్చి దాసరి నారాయణ రావును అభినందిస్తున్నారు.
సందర్భం ఏమిటో తెలియలేదు. దాసరి నారాయణ రావు నన్ను చూడగానే “రా భగీరథ, మంచి టైములో వచ్చావు” అన్నారు.
అప్పటికీ నాకు అర్ధం కాలేదు.
దాసరి దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. షూటింగ్ కు కాసేపు విరామం ఇచ్చేశారు.
అంతలో కో డైరెక్టర్ స్వీట్ పాకెట్ తీసుకొచ్చాడు.
దాసరి ఓ స్వీట్ నాకు అందించారు. అప్పటికీ నాకు సందర్భం ఏమిటో తెలియలేదు.
అయోమయంగా చూస్తున్నాను. అది దాసరి గ్రహించారు.
DNR“ఈరోజు తో నేను దర్శకుడు గా 10 సంవత్సరాలు పూర్తి చేశాను. 11వ సంవత్సరంలో అడుగుపెట్టాను. నా తొలి సినిమా “తాతా మనవడు” 23 మార్చి 1972లో విడుదలైంది. అందుకే ఈరోజు యూనిట్ అంతా సెలెబ్రేషన్స్ మూడ్లో వున్నారు” అని చెప్పారు.
అప్పుడు నేను లేచి దాసరి నారాయణ రావుకు శుభాకాంక్షలు చెప్పాను.
కాసేపటికే ఫ్లవర్ బొకేలు, స్వీట్లు, కేక్ వచ్చాయి. అందరినీ పిలిచిన తరువాత దాసరి నారాయణ రావు ఆనందంగా కేక్ కట్ చేశారు.
లంచ్ బ్రేక్ వరకు షూటింగ్ జరగలేదు. ఈ వార్త తెలిసి దాసరి నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్ కు వచ్చి అభినందించారు.
Dasari 1
విశేషం ఏమంటే రెండవ రోజు అంటే మార్చి 24వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1982లో విడుదలైన సినిమాల నంది అవార్డులను ప్రకటించింది.
ఈ అవార్డుల్లో దాసరి నారాయణ రావు తన తారక ప్రభు బేనర్ మీద నిర్మించి, దర్శకత్వం వహించిన “మేఘసందేశం” సినిమాకు నంది అవార్డుల పంట పండింది. ఏకంగా ఈసినిమాకు 9 నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమా 24 సెప్టెంబర్ 1982లో విడుదలైంది.
ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు, జయప్రద, జయసుధ నటించారు. రమేష్ నాయుడు సంగీతం, సెల్వరాజ్ ఛాయాగ్రహణం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
“మేఘసందేశం” సినిమాలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, వేటూరి సుందర్ రాంమూర్తి, పాలగుమ్మి పద్మరాజు వ్రాసిన గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
DNR 2పాటలను జేసుదాసు, బాలసుబ్రమణ్యం, సుశీల, శైలజ, పూర్ణచంద్ర గానం చేశారు.
“మేఘసందేశం” సినిమాకు ప్రభుత్వం 9 నంది అవార్డులను ప్రకటించడంతో అన్నపూర్ణా స్టూడియోస్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
నేను వెళ్ళేటప్పటికి అన్నపూర్ణ స్టూడియోస్ దాసరి అభిమానులు, నిర్మాతలు, సినిమా రంగ ప్రముఖులతో నిండిపోయింది.
దాసరి నారాయణ రావును పూల బొకేలు, దండలతో అభినందిస్తున్నారు.
దర్శకుడుగా దాసరి నారాయణ రావు 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన “మేఘ సందేశం” చిత్రానికి 9 నంది అవార్డులు రావడం అదో సరికొత్త రికార్డు.
Dasari 2దర్శకుడుగా 150 సినిమాలు చేసిన సునిశిత ప్రజ్ఞ ఆయనది.
నటుడుగా, దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడుగా బహు ముఖాలుగా ఎదిగి ఒదిగిన మహామనిషి దాసరి.
దాసరి నారాయణ రావు తన చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రలో చెరగని సంతకం చేసి వెళ్లిపోయారు.
దాసరి నారాయణ రావు భౌతికంగా మరణించినా ఆయన చిత్రాల ద్వారా చిరస్థాయిగా మిగిలే వుంటారు.
-భగీరథ

Related posts