telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన అషురెడ్డి.. వీడియో వైరల్

సంచలనాలకు మారుపేరు రామ్‌ గోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కామెంట్ చేస్తారో ఎవరికీ తెలియదు. సీన్‌లోకి దూరాడంటే రచ్చ రచ్చే. కేవలం సినిమా అంశంపైనే కాకుండా సమాజంలో జరిగే ప్రతి అంశంపైనా ఇతరులకు భిన్నంగా కౌంటర్ ఇస్తుంటాడు. ఆర్జీవీ కామెంట్స్ వైరల్ అవ్వడమే కాకుండా వివాదాస్పదం అవుతూ ఉంటాయి. అయినా ఈ వివాదాస్పద దర్శకుడి ఇంటర్వ్యూ కోసం లేడీ యాంకర్స్ క్యూ కడుతుంటారు. ఆయనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌లు ఎంతగానో ఫేమస్ అవుతుంటారు. దీనికి ఉదాహరణ బిగ్‌ బాస్ బ్యూటీ అరియానా. ఆర్జీవీ ఇంటర్వ్యూతో అరియానాకు బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో అవకాశం వచ్చింది.

తెలుగులో డబ్‌స్మాష్‌లతో పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్న వారిలో అషురెడ్డి ఒకరు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో బుల్లితెరకు పరిచయమైన మరో బ్యూటీ అషు రెడ్డి కూడా వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఈ మధ్య బుల్లి తెర షోల్లో తెగ కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యేందుకు వర్మను కలిసింది. తన ఇంటర్వ్యూ కోసం వచ్చిన లేడీ యాంకర్స్‌ పట్ల వర్మ ఎలా ప్రవర్తిస్తాడో అందరికీ తెలిసిందే. తనదైన మాటలు, చేష్టలతో వారిని పొగిడేస్తుంటాడు. అషు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ముందు తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ని చూపించాడు వర్మ. అషురెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా వర్మ కింద కూర్చొని ఫొటో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ వీడియో ఇంకా బయటకు రాలేదు. ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ క్లిప్ మాత్రమే సోషల్ మీడియాలో హల్‏చల్ చేస్తోంది.

ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే యాంకర్లు హాట్‌గా చిట్టిపొట్టి దుస్తుల్లో అతని వద్దకు వెళ్లడం ఈ మధ్య అలవాటుగా మారింది. పలు యూట్యూబ్ ఛానళ్ల యాంకర్లు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు హాట్‌గా తయారయి వెళుతున్నారు. తాజాగా అషురెడ్డి కూడా రాంగోపాల్ వర్మ వద్దకు అలానే వెళ్లింది. ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఏదో ఇంటర్వ్యూకు వెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఆ వీడియోలో అషురెడ్డి ధరించిన దుస్తులు.. ఆమె చేస్తున్న ఎక్స్‌పోజింగ్.. రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్జీవీ తన హీరోయిన్ల అందాలను ఏ యాంగిల్స్‌లో చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో అషురెడ్డిని పలు యాంగిల్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆర్జీవీ ఆ వీడియోలో కనిపించాడు.

Related posts