telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో కొత్త వ్యాపారంలోకి విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

యంగ్ సెన్సేష‌న‌ల్ హీరో ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకుడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి లుక్‌లో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లో “ఫైట‌ర్” మూవీ అనే సినిమా కూడా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇక నేటి తరం కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ యువ కథానాయకుడు సినీ రంగ ప్రవేశం చేసిన అతి కొద్ది కాలంలోనే పాన్ ఇండియా హీరోగా రంగ ప్రవేశం చేయనుండటం విశేషం. విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇప్పటికే రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇంతకు విజయ్ స్టార్ట్ చేయనున్న వ్యాపారమేంటో తెలుసా? మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్. ఏషియన్ సినిమాస్‌తో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట. మహబూబ్ నగర్‌లో ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్‌ను స్టార్ట్ చేయబోతున్నారట. గత ఏడాది మహేశ్‌తో కలిసి ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేసిన ఏషియన్ సంస్థ తాజాగా విజయ్ దేవరకొండతో చేతులు కలపడం విశేషం. ఏఎంబీలాగే ఏవీడి కూడా సక్సెస్ కావాలని విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts