telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు…

court

వ్యవసాయ చట్టాల రద్దుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. రహదారులపై  రైతుల బైఠాయుంపులు, ఆందోళనలు, వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచార‌ణ జ‌రిపింది.. ఢిల్లీ సరిహద్దుల్లో ప్రధాన రహదారుల దిగ్బంధం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయ విద్యార్థి రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా నేడు విచారణ జ‌రిపింది.. ఈ సంద‌ర్భంగా కేంద్రంపై ఘాటుగా స్పందించారు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో గత ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాద‌న్న సుప్రీంకోర్టు.. చట్టాలను నిలుపుదల చేయండి, కమిటీని వేస్తామని ప్రతిపాదించింది… అయితే, కమిటీని వేయండి, కానీ, చట్టాలను నిలుపదల చేయవద్దని సుప్రీంను కోరింది కేంద్రం… చ‌ట్టాల‌ను కోర్టులు నిలిపివేసిన ఘ‌ట‌న‌లు గ‌తంలో లేవ‌ని వ్యాఖ్యాన్నించారు అట‌ర్నీ జ‌న‌ర‌ల్. అయితే, దీనిపై స్పందించిన సీజే.. మా పై నిందలు, విమర్శలు  వచ్చే నిర్ణయాలు తీసుకోబోమ‌ని వ్యాఖ్యానించారు.. మీరే చట్టాలను నిలుపుదల చేయండి లేదా మేమే చేస్తామ‌న్నారు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే… జ‌న‌వ‌రి 15న మ‌ళ్లీ సంప్ర‌దింపులు ఉన్నాయ‌ని అప్ప‌టి వ‌ర‌కు ఆగాల‌ని సుప్రీంకోర్టును కోరారు ఏజీ.. దీనిపై కాస్త ఘాటుగా స్పందించారు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. రైతుల ఆందోళ‌న‌ను కేంద్రం స‌రిగా డీల్ చేయ‌డం లేద‌న్న ఆయ‌న‌.. ఇవాళే ఆదేశాలు ఇస్తామ‌ని వ్యాఖ్యానించారు .

Related posts