నేడు పట్టణంలోని చిన్మయినగర్‌లో మరో బహిరంగ హత్య చోటు చేసుకుంది. సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్‌లో అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపారు. అంతేగాక పోలీసులు వచ్చేంత వరకు వ్యక్తిని హతమార్చిన నిందితుడు అక్కడే కూర్చొని ఉండడం గమనార్హం. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు గురైంది ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాశ్ అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది బుక్కరాయ సముద్రం రమణ అని నిర్థారించారు. గతంలో తన భార్యకు, తనకు గొడవ విషయంలో ప్రకాశ్ డబ్బులు తీసుకొని న్యాయం చేస్తానని చెప్పి మోసం చేయడంతో రమణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.