మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడని.. ఆయన ప్రజల సంక్షేమం కోసం చాలా ముందు చూపుతో ఉన్నారన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమని.. మీరు అడగకున్నా, మీ కష్టాలు తెలుసు కాబట్టి మీ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారు తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని… డిసెంబర్ నుంచి ghmc ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా ఇస్తామన్నారు. ఈ డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 67 వేల సెలూన్లకు, రజకులకు ఉచిత నీరు, ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. కరోనా సమయంలో నష్టపోయిన అన్ని షాప్ లకు 6 నెలల కరెంట్ బిల్లుల నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో నడవని వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చామని.. మూసీ నది ఆధునీకరణకు నిర్ణయించారని తెలిపారు. ఇలాంటి అనేక పథకాలతో పాటు, హైదరాబాద్ నగరాన్ని విశ్వ వ్యాప్త నగరంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ ని అగ్రగామిగా సీఎం కేసీఆర్ చేశారని… ప్రశాంత వాతావరణం ఉన్నందునే లక్షల కోట్ల పెట్టుబడులు మన హైదరాబాద్ కి వస్తున్నాయన్నారు. Ghmc ని మరింతగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
previous post
వారి త్యాగాల ఫలితమే బీజేపీ : బండి