ఐపీఎల్ 2020లో లేట్‌గా బరిలోకి దిగినా సూపర్ ఫామ్‌ను కనబర్చిన గేల్.. 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘క్రిస్ గేల్‌తో కలిసి చాలా కాలం ఆడాను. అతనితో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. గేల్‌తో కలిసి గతేడాది కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాను. ఇప్పడు ఐపీఎల్ కొత్త సీజన్ కూడా వచ‍్చేసింది. అతనితో మళ్లీ ఆడటం కోసం ఎదురుచూస్తున్నా. గేల్ కూడా సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది మరింత రాటు దేలుతున్నాడు. ప్రతి ఏడాది గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను నిజంగా ఆశ్చర్యపోతున్నా. అతడు తరచూ పార్టీలకు వెళ్లినా.. గొప్పగా ఆడుతున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే పంజాబ్‌తో కలిసిన క్రిస్ గేల్ తన బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. అసలు గేల్ ఇంత ఫిట్‌నెస్ ఎలా సాధించాడనేది అర్థం కాలేదు. ఏకధాటిగా 3-4 గంటలు పాటు బ్యాటింగ్ చేసిన తర్వాత కూడా భారీ సిక్సర్లు కొట్టడం అతనికే సాధ్యమైంది. నాక్కుడా అలాంటి ఫిట్‌నెస్ ఉంటే బాగుండేది’ అని పంజాబ్ కింగ్స్ సారధి కేఎల్ రాహుల్ సరదాగా అన్నాడు.