telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలు బిల్డర్లపై “జే-ట్యాక్స్”.. నారా లోకేష్ విమర్శలు

Minister Lokesh comments YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్‌ రెండు నెలల పాలనంతా కమిటీలు, కమిషన్‌లేనంటూ ఆరోపించారు. ఇప్పటికే జగన్ దయవల్ల ఏపీలో ఇసుక దొరక్క బిల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, కార్మికులు ఆకలితో పడుకుంటున్నారని లోకేశ్ తెలిపారు. ఇది చాలదన్నట్లు వైసీపీ నేతలు ఇప్పుడు బిల్డర్లపై జే-ట్యాక్స్(జగన్ గారి పార్టీ ట్యాక్స్) విధిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతలు అనధికారంగా లక్షల రూపాయల మేర జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. ఇందులో తన వాటా ఎంతో జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేశ్ ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ట్వీట్ కు జతచేశారు. వైసీపీ నేతలు గాలిలో తిరుగుతూ భూమిపై సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. గోదావరి వరదల వల్ల జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. బాధితులకు ఎకరాకు రూ.10 వేలు సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Related posts