telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో 30 ఏళ్లలో ప్రపంచం ఇలా అవుతుందా…?

ప్రస్తుతం 2020 నడుస్తుంది. అయితే ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయి.  చాలా ప్రాంతాల్లో ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు.  ఇక ఎండాకాలం వచ్చింది అంటే నరకయాతనే.  ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటె 2050 నాటికి ఇంకెలా మారుతుందో ఊహించడం చాలా కష్టం.  2050 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయంపై వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది.  ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.  వాతావరణ పరిస్థితులు మరింతగా దిగజారే అవకాశం ఉందని, పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకొని భూగర్భజలాలు పెరిగే విధంగా చూడాలని హెచ్చరించింది.  ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన 100 నగరాలు నీటి సమస్యను ఎదుర్కొంటామని, దాదాపుగా 350 మిలియన్ ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొననున్నట్టు ఆ సంస్థ సర్వేలో తేలింది.  వరల్డ్ వైల్డ్ లైఫ్ సర్వే ప్రకారం 100 నగరాల్లో 30 నగరాలు ఇండియాలో,  50 నగరాలు చైనాలో ఉన్నట్టు తెలియజేసింది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది.

Related posts