telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాలపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్… అరెస్ట్ చేయాలంటూ…!

MPL

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాను అరెస్ట్ చేయాలనీ మద్రాస్ హైకోర్టులో సూర్యప్రకాష్ అనే లాయర్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ ఇద్దరు సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ బెట్టింగులకు సంబంధించిన యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని, అందువల్ల చాలా మంది యువకులు ఈ తప్పుడు దారిలోకి వెళ్తున్నారని సంబంధిత న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. కోహ్లీ, తమన్నా ఇద్దరు మొబైల్ ప్రీమియర్ లీగ్(ఎంపిఎల్) అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ యాప్స్ కారణంగా కొంత మంది యువకులు ఆత్మయత్యకు పాల్పడుతున్నారని సూర్యప్రకాష్ ఈ మధ్య జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Related posts