ఇటీవల జరిగిన మారణహోమంతో శ్రీలంక దేశం మరింత కట్టుదిట్టమైన భద్రతనుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది..ఇప్పటికే శ్రీలంకలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమేరికా హెచ్చరికలతో ఈస్టర్ సండే దాడిలో పాల్గోన్న సంస్థతోపాటు మరో కొన్ని ఉగ్రవాద సంస్థలపై ప్రభత్వం నిషేధం విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీవ్ర గ్రూపులను నిషేదిస్తూ ఆసాధరమైన గెజిట్‌ను విడుదల చేశాడు. దీంతోపాటు దేశవ్యాప్తంగా డ్రోన్లను కూడ నిషేధించారు. కాగా ఈ నిషేధం మరో ప్రకటన వెలువడేవరకు కొనసాగనున్నట్టు ప్రకటించారు.
శ్రీలంక నిషేధించిన తీవ్రవాద సంస్థల్లో ఈస్టర్ సండే బాంబు దాడులకు భాద్యత వహించిన (ఏన్‌టీజే ) నేషనల్ తౌహిత్ జమాత్ తోపాటు జమాతే మిల్లాతే ఇబ్రహిం (జేఎంఐ ) విల్లాయత్ ఆస్ సైలానీ( was) లు ఉన్నాయి. శ్రీలంకలో సుమారు 250 మంది బాంబు బ్లాస్ట్‌లో మృత్యువాత పడ్డతర్వాత , మరోసారి దేశంలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది.తాజాగా రెండు వర్గాల మధ్య నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది.
అక్కడ ఉన్న మెజారిటి వర్గం ప్రజలు మైనారీటిలపై రాళ్ల దాడులు కొనసాగిస్తున్నారు..రోజు ఏక్కడో ఒక చోట రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగుతున్నాయి. దీంతో అక్కడ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది.కాగా ఇప్పటికే అక్కడ ముస్లిం మహిళలు ధరించే బుర్కాలు సైతం నిషేధించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుందనే ఆందోళన స్థానిక ప్రజల్లో కొనసాగుంతోంది.
ట్రిపుల్ తలాక్ బిల్లుద్వారా మహిళలకు అన్యాయం: ఒవైసీ