telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సౌందర్య బయోపిక్ లో సాయిపల్లవి ?

Soundarya

సౌతిండియా హీరోయిన్ సౌందర్య ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కోట్లాది మంది అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. మలయాళంలో భారీ చిత్రాలను తెరకెక్కించే ఓ నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్ తీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది అన్ని భాషల్లోనే తెరకెక్కే ఈ సినిమా స్ర్కిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో సౌందర్య పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు టాక్ బయటికి వచ్చింది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. తన అందం, నటనతో ఎందరో ప్రేక్షకుల మనసులను దోచుకున్న సౌందర్య పాత్రలో నటించాలంటే ఏ నటికైనా సాహసమనే చెప్పాలి. ఇక తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తూ ఏప్రిల్ 17న హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Related posts