telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

విడుదలైన రాథేశ్యామ్ న్యూ ఇయర్ పోస్టర్..

ప్రభాస్ కథానాయకుడిగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం‘రాధే శ్యామ్’. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హిగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. ఈ సినిమా దాదాపు వేసవిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాథేశ్యామ్ టీం న్యూఇయర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎవరికీ తెలియకుండా ఈ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి సరిగ్గా అర్థరాత్రి విడుదల చేయడంతో రెబల్ స్టార్ అభిమానుల ఆనందం తారా స్థాయిని మించి పోయింది. న్యూఇయర్ సర్‌ప్రైజ్‌గా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా లవ్‌లీగా ఉన్నాడు. చేతిలో ట్రావెల్ బ్యాగ్‌, తలపై ఓల్డ్ స్టైల్ క్యాప్ పెట్టుకుని హ్యండ్‌సమ్‌గా ఉన్నాడు. ఈ పోస్టర్‌తో పాటు రాధేశ్యామ్‌లో నటిస్తున్న నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలను కూడా వెల్లడించేశారు. ఈ పోస్టర్‌లో ‘మీ హృదయాలను గెలుచుకోడానికి వచ్చేశాడు.. మీరు మరోసారి అతడి ప్రేమలో పడడం ఖాయం. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ఓ కొటేషన్‌ను కూడా రాధేశ్యామ్ టీం రాసుకొచ్చింది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Related posts