పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ నజామ్ సేథీపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రూ.1000 కోట్లకు పరువునష్టం నోటీసు పంపారు. ఈ మేరకు ఇమ్రాన్ తరపు న్యాయవాది బాబర్ అవాన్ యాంకర్‌కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. సేథీపై కనికరం చూపబోమన్నారు.
ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ పీటీఐ అధికారి అస్ఘర్ లెఘరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ వ్యక్తిగత జీవితంపై సేథీ అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. నీతి నియమాలను, చట్టాన్ని ఉల్లంఘించి మరీ ప్రధానిపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రధాని పై ఆయన చేసిన ఆరోపణలకు గాను వెయ్యికోట్లు చెల్లించకుంటే కోర్టు మెట్లు ఎక్కక తప్పదని సేథీని హెచ్చరించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్