telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ రాకముందే ఆర్టీసీ విలీనం ప్రక్రియ: కోదండరామ్

kodandaram protest on inter students suicide

తెలంగాణ రాకముందే ఆర్టీసీ విలీనం ప్రక్రియ మొదలైందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. హన్మకొండలోని ఏకశిలపార్క్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీనం ప్రక్రియకు సంబంధించిన కమిటీల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీవోలు వెలువడే ముందు రాష్ట్ర విభజన జరిగింది అని గుర్తుచేశారు.

ఆర్టీసీ విలీనం ఏపీలో పూర్తయింది, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉందని విమర్శించారు.టీఎస్సార్టీసీని ప్రభుత్వమే నాశనం చేసిందని విమర్శించారు. ఆర్టీసీని లాభనష్టాలతో చూడొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీని బ్రహ్మాండంగా నడుపుకుంటామని నాడు కేసీఆర్ అన్న మాటలను ఈ సందర్భంగా కోదండరామ్ గుర్తుచేశారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కు మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలు తెలుసుగానీ, ప్రజా ప్రయోజనాలు తెలియవని అన్నారు.

Related posts