వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా.. మరోవైపు గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే ఐపీఎల్ 2021 ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. మార్చి 26న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో అయ్యర్ ఎడమ భుజానికి గాయపడ్డాడు. ఆపై జట్టుకు దూరమయి.. ఏప్రిల్ 8న అయ్యర్ భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 120 నుంచి 150 రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు అప్పుడే తేల్చేశారు. దీంతో లంక పర్యటన వరకు అతడు పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం లేదు. దాంతో శ్రీలంక టూర్‌కి శ్రేయాస్ దూరమవడం లాంఛనమైంది. మూడు ఫార్మాట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇంగ్లండ్ టూర్‌లో ఉంటారు కాబట్టి .. శ్రీలంకలో భారత జట్టును నడిపించేదెవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ సెలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు. కెప్టెన్‌గా మొదటి ప్రాధాన్యం భవిష్యత్ సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్‌కే అని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. అయితే అయ్యర్ తాజాగా సెలెక్షన్ నుంచి తప్పుకోవడంతో.. కెప్టెన్ పోటీలో ఉన్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి లైన్ క్లియర్ అయింది.
previous post
next post
రాష్ట్రం పచ్చగా ఉంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి అనిల్