telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మలయాళ సినిమా “మూతన్”కు అమెరికా అవార్డు

moothan

మలయాళ స్టార్ నవీన్ పాలీ హీరోగా నటించిన “మూతన్” అనే చిత్రానికి అమెరికన్ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ప్రదర్శణకు అవకాశం దక్కింది. “మూతన్” చిత్రంలో నివిన్ అక్బర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి శోభిత దూళిపాల్ల నటించడం విశేషం. అద్బుతమైన నటనతో పాటు సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మలయాళంలో ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. గత ఏడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం కేరళతో పాటు ఉత్తర భారతం మొత్తం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడంతో మలయాళ సినీ పరిశ్రమలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఈ సినిమాకు ఏకంగా మూడు అవార్డులు కూడా దక్కాయి. ఒక సౌత్ మూవీ అమెరికన్ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను దక్కించుకోవడం ఓ రికార్డు.

Related posts