గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహం అధికారిక నివాసానికి చేరుకొంది. ప్రణబ్ పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడి ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. 11 నుంచి 12 గంటల మధ్య సామాన్య ప్రజలకు అనుమతిఇస్తున్నారు. అనంతరం గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం ఉంటుంది.
కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తరలిస్తారు. గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ అంబులెన్సులోనే శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…