telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రెండోదశ వ్యాక్సినేషన్ లో మొదట వారికే…

Modi

చైనా నుండి వచ్చిన కరోనా గత ఏడాది నుండి మన దేశంతో పాటు మిగిలిన అన్ని దేశాలను వణికిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ వైరస్ కు మందు వస్తుంది. అయితే మన దేశంలో జనవరి 16 వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు 8 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను అందించారు.  తొలివిడతలో ఆరోగ్యసిబ్బందికి, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ను అందించబోతున్నారు.  మొత్తం మూడు కోట్ల మందికి తొలివిడతలో వ్యాక్సిన్ అందించనున్నారు.  మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందించిన తరువాత రెండో దశలో 50 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది.  రెండోదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక మొదటి వ్యాక్సిన్ ను ప్రధాని తీసుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం.  ప్రజా ప్రతినిధులకు రెండోదశలో టీకాను అందించబోతున్నట్టు ప్రధాని ఇటీవలే సీఎంల సమావేశంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  రెండోదశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలిరోజే ప్రధాని మోడీతో పాటుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా వ్యాక్సిన్ అందించబోతున్నారు.  చూడాలి మరి ఆ రెండో దశ వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది.

Related posts