telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ నటుడితో ప్రముఖ క్రీడాకారిణి డేటింగ్ ?

Gutta-Jwala

బ్యాడ్మింటన్‌ మాజీ స్టార్‌ గుత్తా జ్వాల ప్రేమలో పడిందనే వార్తలు కోలీవుడ్‌ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ డబుల్స్‌ ఏస్‌ షట్లర్‌ కొన్నాళ్లుగా తమిళ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. విష్ణు విశాల్‌ తమిళంలో ఇప్పటివరకూ 14 సినిమాల్లో నటించాడు. ఇరువురూ తాము సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ విష్ణు తనను ముద్దాడుతున్న ఫొటోను జ్వాల బుధవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోతో ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోంది అనే విషయం నిజమనే క్లారిటీ వచ్చింది అంటున్నారు నెటిజన్లు. ఇక నితిన్ నటించిన “గుండెజారి గల్లంతయ్యిందే” చిత్రంలో గుత్తా జ్వాలా స్పెషల్ సాంగ్ లో నర్తించిన విషయం తెల్సిందే.

Related posts