telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మలయాళ రీమేక్ లో పవన్ ?

Pawan

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘పింక్’ రీమేక్ ‘వ‌కీల్‌షాబ్‌’తోనే రీఎంట్రీనీ స్టార్ట్ చేసిన ప‌వ‌న్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రో రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ని సోషల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను కొంద‌రు నిర్మాత‌లు చేజిక్కించుకున్నారని, అందులో హీరో పాత్ర‌కు ప‌వ‌న్ అయితే న్యాయం చేస్తార‌ని వారు భావిస్తున్నార‌ట‌. పవన్‌కల్యాణ్‌కి ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూపించాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇక పృథ్వీరాజ్ హీరోగా నటించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ కిందటేడాది డిసెంబర్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఒక స్టార్ హీరో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను కోల్పోవడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Related posts