telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ చైతన్య సినిమా వాయిదా ?

Akkineni

ఇటీవల “మజిలీ” సినిమాతో విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి నటించిన “వెంకీమామ” విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాలో సాయిపల్లవితో కలిసి నటిస్తున్నాడు. పలువురు ఇతర దర్శకులు కూడా నాగచైతన్య కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత, నాగచైతన్య తొలి సినిమా “జోష్”ను రూపొందించిన దిల్ రాజు కూడా చైతన్య హీరోగా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కొత్త దర్శకుడు శశి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించారు. చైతన్య సరసన రష్మికను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు. అయితే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను తప్పించారు. మరోవైపు సెకెండాఫ్ కథ విషయంలో నాగచైతన్య అసంతృప్తి వ్యక్తం చేశాడట. దీంతో ఈ ప్రాజెక్టును దిల్ రాజు తాత్కాలికంగా పక్కన పెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. చైతన్య అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభమవుతుందని అంటున్నారు. సెకెండాఫ్‌లో కథకు అవసరమైన మార్పులు చేయడానికి దర్శకుడికి సమయం కూడా దొరుకుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Related posts