telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సినేషన్ : కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం

Corona Virus Vaccine

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొవిడ్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు వెల్లడించింది సర్కార్. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. రెండో డోస్ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. పోర్టల్ లో సమస్య ఉంది.. దాని కోసం కేంద్రాన్ని.. సాఫ్ట్వేర్ లో మార్చాలని కోరామని ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో 3 లక్షల 74 వేల వాక్సిన్ నిల్వ మాత్రమే ఉందని..ప్రతి రోజు రెండున్నర లక్షల వాక్సిన్ కావాలని కేంద్రాన్ని కోరామని తెలిపింది. 18 నుంచి 45 మధ్య వయసుల వాళ్ళు ఓపిక పట్టాలని…రాబోయే మూడు, నాలుగు వారాల్లో వైరస్ వ్యాప్తి తగ్గొచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Related posts