telugu navyamedia
సినిమా వార్తలు

బాల‌య్య‌కు ఫిదా అయిన హీరోయిన్‌

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన “అఖండ” సినిమా గొప్ప విజ‌య‌వంతం అయిన విష‌యం తెలిసిందే. డిసెంబర్ 2వ విడుద‌లైన ఆఖండ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఈ క్ర‌మంలో సినిమా విజయవంతం కావడంతో.. నిన్న వైజాగ్ లో అఖండ’ సక్సెస్ మీట్ ను నిర్వహించింది అఖండ టీం. ఇక ఈ విజయోత్సవ సభ కు అఖండ చిత్ర బృందం మొత్తం తరలి వచ్చింది. అయితే ఇప్పుడు బాలయ్యకు  హీరోయిన్ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

This actress shivered at Balayya's arrival

ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రను పోషించిన హీరోయిన్ పూర్ణ స్టేజ్ పై మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అయ్యారు. త‌న‌కు ఆఖండ సినిమాలో మంచి రోల్ ఇచ్చినందుకు బోయ‌పాటి శ్రీనుకు కృత‌జ్ఞ‌తులు తెలిపింది. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో తన 16 ఏళ్ల కెరీర్ లో ఇంతటి సక్సెస్ ఫుల్ మూవీ వేదికపై మాట్లాడడం ఇదే మొదటిసారని, మాట్లాడడానికి మాటలు రావట్లేదని అన్నారు.

ఇక శ్రీకాంత్ సినిమాలో విలన్ గా భయపెట్టినా తన అందం చూసి అవన్నీ మరిచిపోయానని చెప్పుకొచ్చారు. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలియజేసిన పూర్ణ బాలయ్య గురించి చెప్పడానికి మాటలు రావట్లేదని అంటూ సాష్టాంగ నమస్కారం ద్వారా తన అభిమానాన్ని వ్యక్తపరిచింది.

Nandamuri Balakrishna's Akhanda sets release date- Cinema express

బాలయ్య సినిమాలో నటించడం ఒక అదృష్టమని…ఈ సినిమాలో అఘోర పాత్ర నన్ను వెంటాడింది.  మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పింది.  ఆయన ఒక స్వీట్ పర్సన్ అంటూ ప్రశంసలు కురిపించింది . ప్రస్తుతం నటి పూర్ణ సాష్టాంగనమస్కారం చేసినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts