తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారికను నియమిచండపై పెద్ద దుమారమే రేగుతోంది. మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ లో పాల్గొన్న హారికను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, cmo అధికారులకు తెలవకుండా హరికను నియమించారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. దీంతో ఉప్పల శ్రీనివాస్ గుప్తాను మందలించారు సీఎంఓ అధికారులు. అంతేకాదు… హారిక వివరాలను టూరిజం శాఖ వెబ్సైట్ నుంచి తొలగించారు అధికారులు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస గుప్త కి మంత్రి కేటీఆర్ క్లాస్ పీకారని తెలుస్తోంది. టూరిజం హరిత హోటల్స్ అంబాసిడర్ గా దేత్తడి హారిక నియామకంపై.. అధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, సొంత నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
previous post
next post
పోలీసులను, డాక్టర్లను గౌరవించండి… మనుషులు ఇంకా మారాలి…