చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. బాలీవుడ్ స్టార్… ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళింది. నిజానికి ఈ నెల 12 నుంచి అలియాభట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనవలసి ఉంది. అయితే ఇటీవల సంభవించిన పరిణామాల కారణంగా తనంతటతాను క్వారంటైన్ లోకి వెళ్ళింది. అలియా బోయ్ ప్రెండ్ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో పాటు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కూడా కొవిడ్ పాజిటీవ్ ని నిర్ధారణ అయింది. అలియా తాజా చిత్రం ‘గంగూభాయ్ కతివాడి’కి సంజయ్ దర్శకుడు కావటంతో పాటు బ్రహ్మాస్త్ర సెట్ లో బోయ్ ఫ్రెండ్ రణ్ బీర్ తో కలసి నటించటం కారణంగా ఈ రెండు యూనిట్స్ మెంబర్స్ అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే అలియాకు కొవిడ్ నెగెటీవ్ అని తేలింది. అయినా అలియా ప్రతి రోజు కొవిడ్ టెస్ట్ చేయించుకుంటూ వస్తోంది.
previous post