telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

విమానం కూలిన ఘటనలో .. 12 మంది మృతి..

12 died in flight crash

ప్రయాణికుల విమానం కూలిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కొలంబియాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలోనే తరారీయా, డోరిస్‌ గ్రామాల మేయర్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. డగ్లస్‌ డీసీ-3 విమానం శాన్‌జోస్‌ డెల్‌ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

విమాన ఇంజిన్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వివరించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని తెలిపారు.

Related posts