telugu navyamedia
సినిమా వార్తలు

తల్లి కాబోతున్న హీరోయిన్… ఇంకేం దొరకలేదా అంటున్న లక్ష్మీరాయ్

Raai-Lakshmi

సాధారణంగా నటీనటులు, రాజకీయ నాయకులు వంటి సెలెబ్రిటీలపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కానీ వాళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోరు. అందుకే స్పందించరు కూడా. కొంతమంది మాత్రం తమపై వచ్చిన రూమర్స్ కు కోపం కట్టలు తెంచుకున్నప్పుడు మీడియా ముఖంగానే ఆగ్రహం వెళ్లగక్కుతారు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా కోలీవుడ్ మీడియాపై ఫైర్ అయ్యారు. తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఇటీవల లక్ష్మీరాయ్ వ్యాయామం చేస్తున్న ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ ఎవరేమన్నా పట్టించుకోనని అర్థం వచ్చేలా కొటేషన్ తో పోస్ట్ చేశారు. అది చూసిన తమిళ్ మీడియా లక్ష్మీరాయ్ ప్రెగ్నంట్ అనే రూమర్స్ ప్రచారం అవుతున్నాయంటూ కథనాన్ని ప్రచురించింది.

దీనికి కౌంటర్ గా లక్ష్మీరాయ్ “వావ్… నిజమా ? అర్థంపర్థంలేని స్టోరీలను అల్లడంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారో బాగా అర్థమవుతోంది. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి పని చేశారని తెలుస్తోంది.. దానికి బదులు నన్ను సంప్రదించి ఉంటే ఇంకా మంచి కథను ఇచ్చేదాన్నిగా” అంటూ సమాధానమిచ్చారు. ఇక ఇలాంటి వార్తను ప్రచురించడం సిగ్గుచేటని లక్ష్మీరాయ్ అభిమానులు మండిపడుతున్నారు.

Related posts