telugu navyamedia
సినిమా వార్తలు

గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్‌ షో..హోస్ట్‌గా నాగ్‌ ఎంట్రీ అదుర్స్‌

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా ఐదోసారి(బిగ్‌బాస్‌ ఓటీటీతో కలిపి) హోస్ట్‌గా చేస్తున్నారు. స్టార్‌ మాలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో నాగార్జున గ్రాండ్‌ ఎంట్రీతో ప్రారంభమైంది.

‘గెలుపు ఆటమీద ఆసక్తి ఉన్నవాడిని కాదు..ఆటలో ఆశయం ఉన్నవాడిని మాత్రమే గెలిపిస్తుంది.ఈ ఆటలో స్నేహల మధ్య కాస్త పలకరింపుకు పులకరించబోయే ప్రేమలు ఉంటాయి. స్నేహలు, ప్రేమలు ఎన్ని ఉన్నా గెలవాల్సిన చోట నిలబడాల్సినప్పుడు యుద్దాలు ఉంటాయి.

ఓదార్పు దూరమై ఒంటరితనం దగ్గరైనప్పుడు ఒడికి చేరిన కన్నీళ్లు ఉంటాయి. ఎన్ని ఉన్నా ఈ యుద్దంలో ఆత్మ విశ్వాసమే ఆయుధం అయినప్పడు ప్రశ్నించడానికి, ప్రశంసించాడనికి, సమర్థించడానికి, శాసించడానికి గెలుపుకు తోడుగా, ఓటడికి ధైర్యంగా,అందరికి అండగా, రాజ్యాన్ని గెలిచే రాజు ఒక్కడుంటాడు’అంటూ హోస్ట్‌ నాగార్జునని పరిచయం చేశారు.

Related posts