telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా… వర్మకు ప్రముఖ నిర్మాత కౌంటర్

RGV

ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. `పవర్‌స్టార్` సినిమా తీసి పలు వివాదాలు రేకెత్తిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు కౌంటర్‌గానే నాగవంశీ ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. `పవర్‌స్టార్` ట్రైలర్‌లో మెగా ఫ్యామిలీతోపాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా అవమానించే విధంగా కొన్ని సీన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సన్నిహితుడు నాగవంశీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. `ఈ రోజుల్లో సెన్సేషనలిజమ్ అనేది సాధారణంగా మారిపోయింది. తమ మనుగడ కోసం వేరు వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే రాబంధులు ఎక్కువైపోయాయి. ఇలాంటి వారికి సిగ్గు ఉండదు. వారితో పోరాటం చేయడానికి ఏకైక మార్గం వారిని పట్టించుకోకపోవడమే” అని నాగవంశీ ట్వీట్ చేశారు. కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా అంటూ `అరవింద సమేత`లో ఎన్టీయార్ డైలాగ్ చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు.

Related posts