telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”… సుజనా చౌదరి అడ్డుకుంటున్నారు…!

KRKR

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై సెన్సార్‌ బోర్డు వద్ద చిత్ర యూనిట్ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు నుంచి రాజశేఖర్ సినిమా చూసి రివైజింగ్ కమిటీకి రెఫర్ చేశారని, కట్స్ సబ్మిట్ అడిగారని చెప్పారు. మొత్తం సబ్మిట్ చేసినా ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. రేపు సినిమా రిలీజ్ చేయడానికి డేట్ ప్రకటించామని చెప్పారు. టీడీపీ నేతలు రూ. 50 లక్షలు ఇచ్చి సినిమా విడుదల కాకుండా ఆపుతున్నారని ఆరోపించారు. సుజనా చౌదరి కూడా సినిమాను అడ్డుకుంటున్నారని చెప్పారు. సెన్సార్‌బోర్డు రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్ తమను రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని నట్టికుమార్ తెలిపారు. ఈ రోజు హైకోర్టులో మరోసారి విచారణ ఉందని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, హైకోర్టు తీర్పు తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Related posts