telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

14 రోజులపాటు బయటకు రానంటున్న కమెడియన్

mallesam

చైనాలోని పుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 163 దేశాల్లో విస్తరించింది. వరల్డ్ వైడ్‌గా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటు ఇండియాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ప్రియదర్శి కరోనా వైరస్ కారణంగా వైద్యుల సూచనల మేరకు సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాడు. 14 రోజుల పాటు తాను ఇల్లు కదిలేది లేదని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు ప్రియదర్శి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా షూటింగు కోసం ఇటీవలే జార్జియా వెళ్లాడు. అక్కడ తన షూటింగ్ పూర్తికావడంతో… తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షల అనంతరం నేరుగా ఇంటికి వెళ్లాడు ప్రియదర్శి. 14 రోజులపాటు బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తనకు తాను క్లీన్‌చిట్ ఇచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వైద్యుల సూచన మేరకు 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటానన్నాడు. దీంతో ప్రియదర్శి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Related posts