telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

25 ఏళ్ళ క్రితం రేప్‌కి గుర‌య్యానంటున్న హీరోయిన్

Anabella

గత కొన్ని రోజుల క్రితం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖుల ముసుగులో ఉన్న ఎంతోమంది మృగాళ్ల పేర్లు బయటకు వచ్చాయి కూడా. అయితే హాలీవుడ్ లో మాత్రం ఇంకా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా సోప్ర‌నోస్ న‌టీమ‌ణి అన్నాబెల్లా సియ‌ర్రా తాను 25 ఏళ్ళ క్రితం రేప్‌కి గుర‌య్యాన‌ని చెబుతూ, అందుకు కార‌కుడు హార్వే వైన్‌స్టీన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ స‌మ‌యంలో త‌న‌కి తానుగా క‌త్తెరతో గాయ‌ప‌ర‌చుకోవాల‌ని భావించింద‌ట‌. న్యూయార్క్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని అన్నాబెల్లా స్ప‌ష్టం చేసింది. గ‌తాన్ని గురించి చెబుతూ అన్నాబెల్లా చాలా ఎమోష‌న‌ల్ అయింది. వెనెస్టీన్ గ‌తంలో మీమీ హ‌లేయ్, జెస్సికా మాన్‌ల‌ని కూడా లైంగికంగా వేధించాడు అని తెలిపింది.

Related posts