ప్రతి ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులను ఉత్తమ చిత్రాలు, ఉత్తమ టీవీ ప్రోగ్రామ్స్‌కి ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్లోబల్ గ్లోబ్స్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. తారలందరు వెరైటీ డ్రెస్సులలో రెడ్ కార్పెట్‌పై నడచి వీక్షకులకి కనువిందు చేశారు. ఉత్తమ చిత్రం అవార్డ్ 1917కి దక్కగా, ఉత్తమ హీరోయిన్‌గా రెన్నీ జెల్‌వెగర్ ( జుడీ), ఉత్తమ హీరోగా జోక్విన్ ఫోనిక్స్ ( జోకర్) చిత్రానికి అవార్డులు గెలుచుకున్నారు. ఇక రస్సెల్ క్రోకి బెస్ట్ యాక్టింగ్ అవార్డ్ దక్కగా, ఆయన ఈవెంట్‌కి హాజరు కాలేదు. ఆస్ట్రేలియాలో వేరే పనితో బిజీగా ఉన్న క్రమంలో రస్సెల్ హాజరు కాలోకపోయాడు. ఒలీవియా కొల్మాన్.. ది క్రౌన్ చిత్రానికి గాను బెస్ట్ యాక్ట్రెస్( డ్రామా) అవార్డ్ అందుకున్నారు. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన జోకర్ చిత్రం రెండు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులని దక్కించుకోవడం విశేషం. చిత్రంలో జోకర్‌గా అద్భత నటపటిమ కనబరచిన జోక్విన్ ఫోనిక్స్ అవార్డ్ అందుకున్న సమయంలో ఉద్వేగంగా మాట్లాడారు. దాదాపు ఆరు నిమిషాలు మాట్లాడిన ఆయన మాటలని కొన్ని మ్యూట్ చేశారు. చివరలో తన ప్రియురాలకి లవ్ యూ అని స్టేజ్‌పై నుండే చెప్పి తన ప్రసంగం ముగించాడు ఫోనిక్స్. సుమారు 90 మంది సభ్యులు ఈ అవార్డులను ఎంపిక చేస్తారు. ఉత్తమ చిత్రాలను రెండు క్యాటగిరీల్లో విభజిస్తారు. బెస్ట్ డ్రామాతో పాటు బెస్ట్ మ్యూజికల్‌గా అవార్డులను ఇస్తారు.
previous post