సుశాంత్ ఆత్మహత్యపై అతడి తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నటి రియా సహా ఆరు మందిపై ఆయన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు ఇప్పటికే ఓసారి అంకితా లోఖండేను దర్యాప్తు చేశారు. విచారణలో ”రియా తనను వేధిస్తోందని సుశాంత్ తనతో ఓసారి చెప్పాడని” అంకితా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అంకితా.. సుశాంత్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. సుశాంత్ చాలా సంతోషంగా జీవించేవాడని, పరిస్థితులు బాగోలేక ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, గతంలో తామిద్దరం కలిసి ఉన్నప్పుడు ఇంతకన్నా దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నామని, కానీ ఎప్పుడు సుశాంత్ తన నమ్మకాన్ని కోల్పోలేదని, డిప్రెషన్‌కి గురి కాలేదని ఆమె అన్నారు. తన కోరికలకు సంబంధించి సుశాంత్ ఓ డైరీలో అన్ని రాసుకున్నాడని, ఐదేళ్లలో అన్ని కోరికలను నెరవేర్చుకున్నాడని అంకితా వెల్లడించారు. సుశాంత్ అప్‌సెట్‌లో ఉండి ఉండొచ్చు కానీ అతడు డిప్రెషన్‌లో ఉన్నాడు, బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు అనడం కరెక్ట్ కాదని అన్నారు. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి అంటూ సుశాంత్‌ని ప్రజలు గుర్తు పెట్టుకోకూడదని, ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఓ ఇన్ఫిరేషన్‌గా సుశాంత్‌ని గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు.
next post