తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కరోనా నిబంధనల మధ్య ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేశారు.
పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుండగా.. మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతానికి పైగా ఓట్లు పోల్ అయినట్టు చెబుతున్నారు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ నెల 14వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
కాగా..కేటీఆర్ , మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు, సీఎల్పీనేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క , మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి… ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు తదితరులు వారి వారి జిల్లాల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.