telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ మృతులకు .. ఉద్యోగాలిచ్చేసిన కేసీఆర్..

kcr stand on earlier warning to rtc employees

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమ్మె విరమణ అనంతరం జరిగిన సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం, సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ్యం ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ గత వారం సూచించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే సమ్మెలో భాగంగా మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుగు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్ జోన్‌ పరిదిలో చనిపోయిన పదిమంది కార్మికుల కుటుంబ సభ్యలకు ఉద్యోగాలు కేటాయించింది. ఇందులో భాగంగా నలుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా.. అయిదుగురికి కానిస్టేబుళ్లుగా.. ఒకరిని కండక్టర్‌గా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలు కేటాయించింది.

Related posts