telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్‌ సినిమాలో అందాల యాంకర్‌ !

బుల్లితెర యాంకర్‌గా ‘పటాస్’ షోతో ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ ఛాన్స్ పట్టేసి తెగ హంగామా చేసింది. విన్నర్ అవుతుందనుకుంటే చివరకు రన్నర్ ట్రోఫీతోనే సర్దుకుంది. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.  అయితే.. ఇటీవలే నితన్‌ 30 వ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నితిన్‌ 30వ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన చిత్ర బృందం… శ్రీముఖిని కూడా ట్యాగ్‌ చేసింది. దీంతో ఇందులో శ్రీముఖి కూడా నటిస్తోందా? అనే డౌట్‌ మొదలయింది. ఇదే ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన శ్రీముఖి ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉందని పోస్ట్‌ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీముఖిని చూపించి వెండితెరపై ఈమె కెరీర్‌ టర్న్‌ చేసే లా ఈ క్యారెక్టర్‌ ప్లాన్‌ చేయబోతున్నారట. దీంతో శ్రీముఖి ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related posts