telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రవితేజతో ప్రస్తుతం అదే సమస్య…

Raviteja

‘రాజా ది గ్రేట్’ తర్వాత మాస్ మహరాజా రవితేజ ఖాతాలో బిగ్ హిట్ మూవీ పడిందే లేదు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే రవితేజ సైతం దీనిని అంగీకరించాడు. ఆ మధ్య మీడియా మీట్ లో ‘తన గత చిత్రాలు ఆడలేదని, అయితే ఇప్పుడు ఆశలన్నీ ‘క్రాక్’ మీదనే ఉన్నాయ’ని రవితేజ చెప్పాడు. ఇదే సమయంలో రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనే ప్రచారమూ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది. రవితేజను వరుస పరాజయాలు పలకరిస్తున్నా, అతనితో సినిమాలు నిర్మించడానికి కొందరు నిర్మాతలైతే సిద్ధంగానే ఉన్నారు. రవితేజ స్టైల్ లో సిల్వర్ స్క్రీన్ మీద జోష్‌ ను చూపించే హీరో మరొకరు లేకపోవడమే దీనికి కారణం. అయితే… వాళ్ళకు రవితేజ ఆశిస్తున్న రెమ్యూనరేషనే ప్రతిబంధకంగా మారుతోందని తెలుస్తోంది. నిజానికి దర్శకుడు మారుతి కూడా రవితేజతోనే సినిమా చేయాలనుకున్నాడని, పారితోషికం విషయంలో వచ్చిన పట్టింపు కారణంగానే అతను మనసు మార్చుకుని గోపీచంద్ తో  ఆ మూవీ తీస్తున్నాడని అంటున్నారు. అలానే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉన్న సినిమాకూ రవితేజ రెమ్యూనరేషనే మెయిన్ డ్రాబ్యాక్ గా మారిందట. అందువల్లే ఆ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఏమీ రావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ… రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ మూవీ ఒక్కటే చేస్తున్నాడు. ఏదేమైనా ‘క్రాక్’ ఫలితంతో రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో ఓ క్లారిటీ వస్తుందన్నది అందరి అంచనా. సంక్రాంతి సీజన్ లో బరిలోకి దిగుతున్న ‘క్రాక్’ హిట్టయ్యితే, రవితేజ కోరుకుంటున్న రెమ్యూనరేషన్ చెల్లించడానికి సదరు నిర్మాతలు ముందుకొస్తారు.

Related posts