telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలికను వేధించిన నటుడు… కేసు నమోదు

Shahbaz

బాలికను లైంగికంగా వేధించిన ప్రముఖ నటుడిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ ఆమిర్ ఖాన్ కుమారుడే షహ్బాజ్ ఖాన్. షహ్బాజ్ ఖాన్ పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలతో పాటు ఒక చైనీస్ సినిమాలో నటించాడు. వీటితో పాటు పంజాబీ, గుజరాతీ, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. బాలికను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటుడు షహ్బాజ్ ఖాన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

Related posts