telugu navyamedia
సినిమా వార్తలు

రాజ‌శేఖ‌ర్ `శేఖ‌ర్‌` చిత్రం మే20న విడుద‌ల‌..

సీనియర్ నటుడు, హీరో రాజశేఖర్ డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన 91వ చిత్రం `శేఖ‌ర్‌`. జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో మలయాళ హీరోయిన్ ఆత్మీన్ రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. .క‌థ ప్ర‌కారం రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు మందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టకుంటున్నాయి

కాగా, ఈ చిత్రం విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను శ‌నివారంనాడు విలేక‌రుల స‌మావేశంలో విడుద‌ల చేశారు. మే 20న ఈ చిత్రం విడుద‌కానున్న‌ట్లు జీవితా రాజ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు.

మాకెంతో స‌హ‌క‌రించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ చిత్రం. ప్రతి ఒక్కరి హృద‌యాల‌ను ట‌చ్ చేస్తుంది. కోవిడ్ వ‌ల్ల ప్ర‌తి కుటుంబం చాలా స‌ఫ‌ర్ అయిన ఎమోష‌న్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు.

రాజ‌శేఖ‌ర్‌గారు న‌టించిన గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి వంటి ఎన్నో చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరించారు. ఇప్పుడు రాబోయే `శేఖ‌ర్‌` చిత్రం కూడా ఆయ‌న స్థాయిని పెంచేలా వుంటుంది. ఈ శేఖర్ సినిమా అనుకున్న టైంలో పూర్తి కావడానికి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది కృషి ఎంతో వుంది. రాజ‌శేఖ‌ర్‌గారు కొత్త సినిమా లుక్ ప‌నిమీద వుండ‌డం వ‌ల్ల రాలేక‌పోయారు. త్వ‌ర‌లో ఆ సినిమా వివ‌రాలు కూడా తెలియ‌జేస్తాం మ‌ని దర్శకురాలు జీవిత రాజశేఖర్ అన్నారు.

Related posts