సింగర్ సునీత.. తన అద్భుతమైనగాత్రంతోనే ఎంతోమందిని మంత్ర ముగ్ధుల్ని చేశారు. టాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు. హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ను, అభిమానులను ఆమె సంపాదించుకున్నారు.
గతేడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సునీత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్న సునీత తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
ఈ క్రమంలో సునీత మామిడి చెట్టువద్ద ఫోటో దిగుతూ షేర్ చేస్తూ.. బ్లెస్డ్ అంటూ క్యాప్షన్ జోడించింది.దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. మరోసారి సునీత తల్లి కాబోతుంది అంటూ వార్తలు వైరల్‌గా మారాయి.
తాజాగా ఈ పుకార్లను ఖండిస్తూ ఫేస్ బుక్ లో మరో పోస్ట్ చేసింది సునీత. ‘నేనేదో సరదాకి పోస్ట్ పెడితే ఇలా క్రేజీ రూమార్లు పుట్టిస్తున్నారు దేవుడా.. నేను ఈరోజు నా మొదటి మామిడి పంటతో ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాను. కానీ ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయని అనుకోలేదు. మీకు దండం రా నాయనా.. ఇకపై ఇలా ఊహిస్తూ వదంతులు ప్రచారం చేయడం మానేయండి’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. దీంతో సునీత ప్రెగ్నెంట్ అంటూ వస్తోన్న వార్తలను చెక్ పెట్టినట్లయ్యింది.
ఓ బేబీ : భారీ కటౌట్ పై నెటిజన్ కామెంట్… సమంత రియాక్షన్