telugu navyamedia
సినిమా వార్తలు

ఈ స్టార్ డైరెక్టర్ ను లంచం అడిగారట…!

bharatiyudu2 movie shoot in Ukraine
విలక్షణ నటుడు, అద్భుత దర్శకుడు కలిస్తే వచ్చే చిత్రాలను గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అవి చూస్తే మరో ప్రపంచానికి వెళ్లి వచ్చినట్టే ఉంటుంది. అలాంటి అరుదైన కలయికలు కూడా చాలా తక్కువే అని చెప్పవచ్చు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన “భారతీయుడు” సినిమా అప్పట్లో సంచలన హిట్ సాధించింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా “భారతీయుడు-2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్. దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. చెన్నైలో ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెడుతున్నారు. ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది. 
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ “భారతీయుడు” సినిమా తీయడం వెనుకున్న కారణాన్ని తెలిపారు. శంకర్ చదువుకుంటున్న రోజుల్లో కాలేజ్ లో అడ్మిషన్ కోసం ప్రయత్నించగా… అక్కడి యాజమాన్యం కులం, ఆదాయ సర్టిఫికేట్స్ కావాలని అడిగారట. దీంతో శంకర్ తన తల్లితండ్రులతో కలిసి సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లగా… వారు లంచం ఇవ్వాలని అడిగారట. ఆ సంఘటనే “భారతీయుడు” సినిమాను తెరకెక్కించేలా ప్రేరేపించింది అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రూపొందిస్తోన్న “భారతీయుడు 2″లో ప్రస్తుతం ప్రతీ సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపై చూపించనున్నట్టు చెప్పుకొచ్చారు. 

Related posts