telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య .. ‘బందోబస్తు’ తెలుగు టీజర్…

surya bandobastu movie teaser

కేవీ ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే తమిళ చిత్రంలో నటించాడు సూర్య. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బందోబస్తు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో దేశ ప్రధానిగా కీలకపాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.

సూర్య టీజర్‌లో డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. రైతుగా, సైనికుడిగా, టెర్రరిస్ట్‌గా విభిన్న పాత్రల్లో వైవిధ్యభరిత నటనతో పాటు విభిన్న సంభాషణలతో ఆకట్టుకుంటున్నాడు. ఉగ్రవారం, సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ ఇతర పాత్రల్లో నటించగా.. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు.

Related posts