సాధారణంగా ఒకేరోజు 2 లేదా మూడు సినిమాలు విడుదలవుతుంటాయి. ఒక్కోసారి నాలుగైదు సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఫిబ్రవరి మొదటివారంలో ఒకేరోజు ఏకంగా అరడజను సినిమాలు విడుదలవబోతున్నాయి. యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. అలాగే.. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రధారులు. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కురి దర్శకత్వంలో రూపొందిని యానియల్ బేస్డ్ లవ్ స్టోరి ‘సవారి’ కూడా ఫిబ్రవరి 7నే విడుదల కానుంది. రామ్, అమితా రంగానధ్ జంటగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘అమృతారామమ్’ కూడా ఫిబ్రవరి 7నే ఫిక్స్ అయిపోయింది.
ఇక ఈ సంక్రాంతికి తమిళనాట సూపర్ హిట్ అయిన ధనుష్ చిత్రం ‘పటాస్’.. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ‘, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. స్నేహ మరో హీరోయిన్. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు.ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ విడుదల చేస్తుస్తున్నారు. వైవిధ్యభరిత చిత్రాలనే కాదు మాస్ చిత్రాలను చేస్తూ ఆల్ రౌండ్ కధానాయకుడిగా జీవా పేరుపొందారు. అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతో దగ్గరయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం పేరు ‘స్టాలిన్’.. (అందరివాడు) ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో ‘సీరు’ పేరుతో విడుదలవుతుంది. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. ఈ చిత్రాల్లో ఏ సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి మరి.