telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుధీర్ బాబు విచిత్ర విన్యాసం… గాల్లో ఆసనాలు

Sudheer-babu

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అదితి రావు హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు మేక‌ర్స్. అయితే ఈ యంగ్ హీరో ఒక్కోసారి విచిత్ర విన్యాసాల‌తో నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంటాడు. ఆయ‌న తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో ఆస‌నాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోల‌కి “ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. న‌న్ను న‌మ్మండి” అని కామెంట్ పెట్టాడు. ఏదేమైన కాళ్ళు ముడిచి చేతుల‌తో దండం పెడుతున్న‌ట్టుగా గాల్లో సుధీర్ బాబు చేస్తున్న విన్యాసాలు ఎంతగానో ఆక‌ట్టుకుంది.

Related posts