telugu navyamedia
సినిమా వార్తలు

సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Sampu

“హృదయ కాలేయం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు సంపూర్ణేష్ బాబు. మొదటి సినిమా “హృదయ కాలేయం”తో నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలోని కామెడీ చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత “సింగం 123” సినిమాలో హీరోగా నటించాడు. అయితే హీరోగా కన్నా తాను ఒక మంచి కమెడియన్ గా తన సత్తా చూపించాలనుకొన్న సంపూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన “కొబ్బరిమట్ట” సినిమా విడుదలైంది. ఈ సినిమా ఊహించని విధంగా విజయాన్ని అందుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా బీ, సీ సెంటర్స్ లో ఇప్పటికి బాగా ఆడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ… తనకు మోహన్ బాబు అంటే ఇష్టమని, డైలాగ్స్ చెప్పడంతో మోహన్ బాబు గారు తనకు ఆదర్శమని, ఇంతకుముందు ఒకటిన్నర నిమిషం పాటు డైలాగ్ చెప్పానని, ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి మూడున్నర నిమిషాల్ డైలాగ్ చెప్పినట్లు వెల్లడించారు. తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ‘హృదయకాలేయం’సినిమాకు తక్కువ రెమ్యూనరేషనే తీసుకున్నానని, నిర్మాత తనను నమ్మి చేశాడు కాబట్టి రెమ్యూనరేషన్‌ కోసం చూసుకోలేదని అన్నారు. కాగా ‘హృదయకాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలతో సంపూ రేంజ్ ఒక్కరోజుకు రెండు నుండి మూడు లక్షలకుఆయన రేటు పెరిగినట్టు సమాచారం.

Related posts