ఆసీస్ తో మూడో టెస్ట్ డ్రా అయినా ఇది భారత్‌కు నైతిక విజయం. అంతకన్నా కూడా విలువైందే. ఎందుకంటే.. సగం జట్టుకు గాయమైనా.. గాయాలతో ఆడడం కష్టంగా ఉన్నా రోజంతా పోరాడింది. ప్రత్యర్థి ప్రయత్నాలన్నింటినీ హనుమవిహారి చిత్తు చేశాడు. ఓపిక వీడకుండా.. ఏకాగ్రత చెదరకుండా.. ప్రత్యర్థి విసిరిన కఠిన సవాళ్లను తిప్పికొట్టారు. విహారి చేసింది 23 పరుగులే అయినా… అతను ఎదుర్కొన్న 161 బంతులు ఆటగాడిగా తన సామర్థ్యం ఏంటో చాటుతున్నాయి. తొడ కండరాల గాయంతో తీవ్రంగా బాధపడిన హానుమవిహారి… దాదాపుగా ఒంటి కాలిపైనే తన పోరాటం సాగించాడు. దాంతో దేశ వ్యాప్తంగా అందరూ విహారి, అశ్విన్ లను అభిమందించారు. కానీ తాజాగా సిడ్నీ టెస్టులో టీమ్ ఇండియా విధానంపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో విమర్శలు చేసాడు. “7 పరుగులు చేయడానికి 109 బంతులు ఆడటం! ఇది దారుణం… ”హనుమా బిహారీ” టీం ఇండియా చారిత్రాత్మక విజయాన్ని చంపడం మాత్రమే కాకుండా క్రికెట్‌ను కూడా హత్య చేసాడు.. అతను ఒక నేరస్థుడు. నోట్ : క్రికెట్ గురించి నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు” అని సుప్రియో ట్విట్ చేసాడు. ఇందులో విహారి పేరును బిహారీగా రాసాడు. అయితే ఈ ట్వీట్ పై విహారి స్పందిస్తూ “హనుమా విహారీ” అని సమాధానం ఇచ్చాడు.
previous post
next post