telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత సారథికి.. ఉగ్రముప్పు.. జట్టుకు పెంచిన భద్రత ..

more security to indian team as threaten call

ఢిల్లీలో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టీ20లో ఆడే టీమిండియా ఆటగాళ్లకు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు. అలాగే సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కూడా ఉగ్ర ముప్పు ఉందని పోలీసులు తెలిపారు. కేరళలోని కోళికోడ్‌ కేంద్రంగా పనిచేస్తున్న అఖిలభారత లష్కర్‌ ఉగ్రవాద సంస్థ(ఎన్‌ఐఏ) పేరుతో బిసిసిఐకి ఒక ఉత్తరం పంపించిందని సమాచారం. టీమిండియా ఆటగాళ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోమంత్రి అమిత్‌షా, బిజెపి సీనియర్‌ నేత అద్వానీ, కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ పేర్లు ఆ లేఖలో ఉన్నాయట.

ఈ ఉత్తరం నకిలీదేనని భావిస్తున్నప్పటికీ ఆటగాళ్ల భద్రతే పరమావధి కాబట్టి వారికి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. నవంబర్‌ 3 నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య అరుణ్‌జైట్లీ మైదానంలో తొలి టీ20 జరగనున్న విషయం తెలిసిందే. మిగతా రెండు టీ20లు రాజ్‌కోట్‌,నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్నాయి. టెస్ట్‌ సిరీస్‌కు ఇండోర్‌, కోల్‌కతా ఆతిథ్యమిస్తున్నాయి.

Related posts