telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిబిఐ ఆఫీసర్ పాత్రలో మీనా ?

Meena

90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ స్టార్ గా కొనసాగిన సీనియర్ హీరోయిన్ మీనా తాజాగా “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ కుమారన్ తెరకెక్కిస్తున్నారు. వివేక్ కుమారన్ మీనా కోసమే ఈ వెబ్ సిరీస్ రాశాడట. కాగా వచ్చే నెల మూడో వారం నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగనుంది. ఈ షూట్ లో మీనాతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు. మీనా ఈ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెరిగింది. అలాగే ఆమె పాత్ర చాల కామిక్ గా ఉండనుందని తెలుస్తోంది. మీనా తమిళంలో ఒక సినిమాతో పాటు ఒక సీరియల్ లో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో కూడా రాజశేఖర్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts